Sai Dharam Tej, Rashmika: ఎప్పటికీ మర్చిపోలేని పెర్ఫార్మెన్స్ ఇచ్చావు రష్మిక!

హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాత అశ్వినీ దత్, స్వప్న నిర్మించిన చిత్రం సీతారామం. ఒక అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించగా రష్మిక తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్ వంటి పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో సందడి చేశారు.

ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. కేవలం మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. సీత, రామ్ మధ్య అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని జోడించి తెరకెక్కించిన ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా విజయం పై ఎంతో మంది సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.

తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి రివ్యూ ఇస్తూ సినిమాలో నటించిన ప్రతి ఒక్క పాత్ర గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఐ హేట్ యు అంటూ తన రివ్యూ ప్రారంభించిన ఈయన నిర్మాత స్వప్న గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం నీవు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు స్వప్నక్క చివరికి కష్టానికి తగ్గ ఫలితం లభించింది అంటూ కామెంట్ చేశారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ హనురాగవపూడి నటుడు దుల్కర్ సల్మాన్, సుమంత్ గురించి కూడా ఈయన ప్రస్తావించారు. ఇకపోతే రష్మిక గురించి కూడా మాట్లాడుతూ ఐ హేట్ యు రష్మిక అంటూనే తన నటన గురించి పొగుడుతూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. నటిగా ఆఫ్రిన్ పాత్రలో ఎప్పటికీ మర్చిపోలేని పెర్ఫార్మెన్స్ ఇచ్చావు. సీతకు రామ్ పంపిన సందేశాన్ని చేర్చే ఒక దూతగా నీ నటన చూసి నాకు ఐ హేట్ యు అనాలనిపించింది అంటూ ఈ సందర్భంగా ఈ సినిమాపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus