మెగా హీరో సాయితేజ్ మంచి మనస్సు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా సాయితేజ్ సినిమాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీన సాయితేజ్ పుట్టినరోజు జరుపుకోగా ఈ సుప్రీమ్ హీరోను ఎంతోమంది అభిమానులు అభిమానిస్తారు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తొలి సక్సెస్ ను సొంతం చేసుకున్న సాయితేజ్ సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకున్నారు.
చిత్రలహరి, సోలో బ్రతుకే సో బెటర్, విరూపాక్ష, బ్రో సినిమాలతో కూడా విజయాలను అందుకున్న సాయితేజ్ కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయితేజ్ సేవాగుణం గురించి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సాయితేజ్ విజయవాడలో వృద్ధుల కోసం గతంలో ఒక భవనాన్ని నిర్మించారు. దివ్యాంగుడు రంగుల నరేష్ యాదవ్ అంతర్జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ కు ఎంపికైనా డబ్బు సమస్య వల్ల ఆగిపోయాడని తెలిసి అతనికి సహాయం చేశారు.
గతంలో పావలా శ్యామల కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే సాయితేజ్ తన వంతు సహాయం చేశారు. 2021 సంవత్సరం ఆగష్టు నెల 10వ తేదీన తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సాయితేజ్ అద్భుతంగా డ్యాన్స్ చేయగలరు. కష్టమైన స్టెప్స్ ను సైతం సాయితేజ్ సులువుగా చేయగలరు. విమర్శలను సైతం పాజిటివ్ గా తీసుకునే అతికొద్ది మంది హీరోలలో సాయితేజ్ ఒకరు కావడం గమనార్హం.
పక్కా మాస్ మసాలా మూవీ గాంజా శంకర్ లో నటిస్తున్న సాయితేజ్ ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి. సాయితేజ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. సాయితేజ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సినిమా సినిమాకు సాయితేజ్ (Sai Dharam Tej) కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు