Sai Dharam Tej: సౌమ్య రావు పరువు మొత్తం తీసిన సాయి ధరమ్ తేజ్?

బుల్లి తెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది సందడి చేస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున నవ్విస్తున్నారు. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరించే వారిపై కూడా అప్పుడప్పుడు కమెడియన్స్ లేదా ఈ కార్యక్రమానికి గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు పంచులు వేస్తూ ఉంటారు .గతంలో అనసూయ పై ఈ విధమైనటువంటి పంచ్ డైలాగులు వేస్తూ పెద్ద ఎత్తున సందడి చేసేవారు.

ఇక అనసూయ స్థానంలో ప్రస్తుతం యాంకర్ గా సౌమ్యరావు కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే కమెడియన్స్ సౌమ్య రావు పై కూడా తనదైన స్టైల్ లో పంచ్ డైలాగులు వేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఏదైనా సినిమా విడుదల అవుతుంది అంటే పెద్ద ఎత్తున చిత్ర బృందం బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్ ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో విరూపాక్ష టీం సందడి చేసినట్లు తెలుస్తోంది.

విరూపాక్ష సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ కార్తీక్ దండుతో పాటు హీరో సాయి ధరమ్ తేజ్ సంయుక్త మీనన్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన సాయిధరమ్ తేజ్ యాంకర్ సౌమ్యరావు పై తనదైన పంచ్ డైలాగులు వేస్తూ తన పరువు మొత్తం తీసేసారు.

సౌమ్య రావు అందంగా చీర కట్టుకొని ముస్తాబయి రావడంతో ఆమెను చూస్తున్నటువంటి సాయి ధరంతేజ్ ఏంజెల్ ఇలా చీర కట్టుకొని రావడం ఫస్ట్ టైం చూస్తున్నాను అంటూ కామెంట్ చేయడంతో ఆయన మాటలకు సౌమ్యరావు తెగ సిగ్గుపడుతూ మురిసిపోతుంది. అయితే వెంటనే సాయి ధరంతేజ్ మిమ్మల్ని కాదు అన్నది అంటూ తన పరువు మొత్తం తీసేసారు. ఇలా ఈ కార్యక్రమంలో ఈయన పెద్ద ఎత్తున సందడి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus