Sai Kumar, NTR: 72 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్ అలా చేశారా?

సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఎన్నో సక్సెస్ లను సొంతం చేసుకున్నారు. ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన సాయికుమార్ గంధర్వ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నేను నాటకాలు వేసుకునే నాటి నుంచి మేకప్ వేసుకుని ఇప్పటికి 50 సంవత్సరాలు అయిందని ఆయన తెలిపారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నటుడిగా 50 సంవత్సరాల ప్రస్థానం అని సాయికుమార్ తెలిపారు.

కొన్ని సినిమాలు చూసిన సమయంలో నటుడిగా ఇంకేదో చేయాలని అనిపిస్తుందని నటుడికి సంతృప్తి ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. మేజర్ చంద్రకాంత్ మూవీ షూట్ జరిగే సమయానికి సీనియర్ ఎన్టీఆర్ వయస్సు 72 సంవత్సరాలు అని 72 సంవత్సరాల వయస్సులో ఒక సన్నివేశంలో భాగంగా పై నుంచి దూకాలని ఆ సన్నివేశం డూప్ లేకుండా చేస్తానని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ చేశారని సాయికుమార్ పేర్కొన్నారు. నటుడికి ఆ స్థాయిలో డెడికేషన్ ఉండాలని సాయికుమార్ చెప్పుకొచ్చారు.

నేను నేర్చుకున్నది కూడా ఇదేనని ఆయన తెలిపారు. కన్నడలో నేను కామెడీ చేశానని ఈ మధ్య కాలంలో పౌరాణికంలో దుర్యోధనుడిగా నటించానని సాయికుమార్ చెప్పుకొచ్చారు. ఇంకా పలు భిన్నమైన పాత్రలలో నటించాలని ఉందని సాయికుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళంలో ప్రస్తుతం డీజిల్ అనే సినిమాలో చేస్తున్నానని ఆయన తెలిపారు.

ఈ సినిమాలో మూడు గెటప్ లలో డీజిల్ మాఫియా లీడర్ గా కనిపిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించబోతున్నానని ఆయన కామెంట్లు చేశారు. గంధర్వలో సందీప్ తో కలిసి నటించానని టైటిల్ కు తగినట్టే గంధర్వ కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా అని సాయికుమార్ కామెంట్లు చేశారు. ఇప్పటి జనరేషన్ మేధావులలా ఆలోచిస్తున్నారని సాయికుమార్ పేర్కొన్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus