Sai Madhav Burra: వీరమల్లుపై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయి మాధవ్!

పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ఏడాది విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి కాగా కొంతకాలం గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచారు.

Click Here To Watch NOW

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన పలు సినిమాలకు సాయిమాధవ్ బుర్రా మాటల రచయితగా పని చేశారు. ఫ్యాన్స్ పవన్ ను ఏ విధంగా చూడాలని భావిస్తున్నారో పవన్ ఈ సినిమాలో అదే విధంగా కనిపిస్తారని సాయిమాధవ్ బుర్రా అన్నారు. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న పాత్ర గతంలో ఆయన ఎప్పుడూ చేయని పాత్ర అని సాయిమాధవ్ బుర్రా కామెంట్లు చేశారు. అలాంటి జోనర్ లో, అలాంటి క్యారెక్టర్ లో పవన్ కనిపించలేదని ఆయన వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ అభిమానులలో ప్రతి అభిమాని గర్వంగా చెప్పుకునే విధంగా హరిహర వీరమల్లు సినిమా కానీ, పవన్ కళ్యాణ్ పాత్ర కానీ ఉంటాయని సాయిమాధవ్ బుర్రా కామెంట్లు చేశారు. జానపదంగా హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతోందని ఆయన కామెంట్లు చేశారు. సాయిమాధవ్ బుర్రా తన మాటలతో ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేశారు. సినిమా రిలీజ్ సమయానికి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. హరిహర వీరమల్లు సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది.

క్రిష్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే క్రిష్ కు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఎ.ఎం.రత్నం ఈ సినిమాను ఖర్చు విషయంలో రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం ఈ సినిమా రిజల్ట్ విషయంలో భారీస్థాయిలో ఆశలు పెట్టుకున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus