Sai Pallavi: ‘లవ్‌స్టోరీ’ కిస్‌పై సాయిపల్లవి క్లారిటీ!

సినిమాల్లో ముద్దు సీన్లు చూసి నిజం అనుకుంటుంటారు. కొన్నిసార్లు నిజంగానే ముద్దు పెట్టుకుంటారు నాయకానాయికలు. కొన్నిసార్లు మాత్రం కెమెరా ట్రిక్‌తో కనికట్టు చేస్తుంటారు. దీనికి కారణం ఆ హీరో లేదా హీరోయిన్‌ ‘నో కిస్సింగ్‌’ రూల్‌ను పెట్టడమే. సినిమాల్లో ముద్దు సీన్లకు పక్కగా నో చెబుతుంటారు కొందరు. అలాంటి కథానాయికల్లో సాయిపల్లవి ఒకరు. అయితే ఇటీవల వచ్చిన ‘లవ్‌ స్టోరీ’లో రెండు ముద్దు సీన్లున్నాయి కదా అనొచ్చు. వాటి గురించే ఇప్పుడు చెబుతున్నాం.

ప్రేమ కథలు అంటే ముద్దు సీన్లు కచ్చితంగా ఉండాల్సిందే అంటుంటారు. అప్పుడే కథ, కథనం పండుతుంది. ప్రేక్షకుల్లో ప్రేమకథ ఫీలింగ్‌ కూడా వెళ్తుంది. అందులో ముద్దు సీన్ల విషయంలో దర్శకులు పక్కగా ఉంటారు. అయితే సినిమాలో ‘నో కిస్సింగ్‌’ రూల్ పెట్టుకున్న హీరోయిన్‌ ఉంటే మాత్రం కెమెరా ట్రిక్‌ ఉపయోగిస్తారు. అంటే కెమెరా యాంగిల్‌లో చిన్నపాటి మార్పులు చేసి… లేని ముద్దును ఉన్నట్లు చూపిస్తారు. ‘లవ్‌స్టోరీ’ విషయంలోనూ ఇదే జరిగిందట.

సాయిపల్లవి ‘నో కిస్సింగ్‌’ రూల్‌ను బ్రేక్‌ చేయకుండా దర్శకుడు, కెమెరామెన్‌ చాలా జాగ్రత్తగా కెమెరా ట్రిక్‌ వాడారట. ఈ విషయం సాయిపల్లవే చెప్పింది. ‘లవ్‌స్టోరీ’లో మీరు చూసిన ముద్దు సన్నివేశాలు నిజం కావు. సినిమా కోసం ముద్దు సీన్‌ తప్పదు అనేసరికి… నా కోసం అలా కెమెరాతో ట్రిక్‌ చేసి ముద్దు పెట్టుకున్నట్లు చూపించారు అని చెప్పింది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus