పవన్ విషయంలో కన్ఫ్యూషన్ లో సాయి పల్లవి!

మల్యాల బొమ్మ సాయి పల్లవి…ప్రేమమ్ సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంది…అయితే తెలుగు ప్రేమమ్ లో కూడా ఆమె నటించాల్సి ఉండగా అనుకోకుండా ఆమె ప్లేస్ లో శ్రుతి హసన్ ఎంట్రీ ఇచ్చింది…ఇక ఆ తరువాత విషయం పక్కన పెడితే…టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో మన మెగా హీరో వరుణ్ తెజ్ ఒకడు…కరియర్ మొదలు పెట్టిన సమయం నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తూ హిట్స్ కోసం ఎదురు చూస్తున్న మెగా హీరోకి రాక రాక హిట్ వచ్చింది…అదీ ఆ క్రెడిట్ అంతా హీరోయిన్ సాయి పల్లవిదే…అవును ‘ఫిదా’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు మన మెగా టాల్ హీరో వరుణ్….అయితే ఈ సినిమాలో వరుణ్ కు ఎంత క్రేజ్ వచ్చిందో తెలీదు కానీ…ప్రస్తుతం ఎక్కడ చూసినా సాయి పల్లవి గురించి వార్తలతో మీడియా హోరెత్తిపోతోంది. టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా ఆమె మారడంతో ప్రస్తుతం చాలమంది దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ గురించి క్యూ కడుతున్నట్లుగా వార్తలు వాస్తున్నాయి.

ఇదిలా ఉంటే …మరో పక్క ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవేమిటి అంటే…ఫిదా’ సినిమాలో థియేటర్లలో పవన్ కల్యాణ్ కనిపించినప్పుడు వచ్చిన రెస్సాన్స్ చూసి ఖంగు తిన్నాను అంటూ ఒక  దశలో తన  డైలాగ్స్‌ కు చప్పట్లు కొడుతున్నారా లేదా పవన్ చూసి క్లాప్స్ కొడుతున్నారా అనే కన్ఫ్యూజన్ తనకు ఏర్పడినట్లు కామెంట్ చేసింది. అంతేకాదు ఈ మూవీ  ఆడియో ఫంక్షన్‌లో పవన్ పేరు చెపితే హాలంతా చప్పట్లతో మారుమ్రోగిపోయిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ  తనకు పవన్ తో కలిసి నటించాలి అని ఏర్పడిన కోరికను బయట పెట్టింది. మొత్తంగా చూసుకుంటే ఒక పక్క సాయి పల్లవి…మరో పక్క పవన్ కల్యాణ్ క్రేజ్ రెండూ కలసి ఈ సినిమాని మంచి హిట్ చేశాయి…ఏదైతేనేం వరుణ్ కి మంచి హిట్ వచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus