ఆ హీరో సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న సాయి పల్లవి
- July 31, 2017 / 07:13 AM ISTByFilmy Focus
తెలుగులో ఒకే ఒక్క సినిమాతో సాయి పల్లవి పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది. ఫిదా చిత్రంలో భానుమతిగా ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. సాయి పల్లవితో జోడీగా సినిమా చేయాలనీ యువహీరోలు ఆరాటపడుతున్నారు. ఇక నిర్మాతలు సైతం ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. కోటి రూపాయలు ఇవ్వడానికైనా సిద్ధపడుతున్నారు. అయినా ఒకే చెప్పని ఈ బ్యూటీ ఒక హీరో పక్కన నటించాలని ఆశపడుతోంది. అతను ఎవరో కాదు తమిళ హీరో సూర్య. సూర్య సినిమాలు చూస్తూ తాను పెరిగానని, అతనికి వీరాభిమానిని అని మీడియా ముందు చెప్పిన సాయి పల్లవి.. సూర్య సినిమాలో ఛాన్స్ వస్తే అసలు వదులుకోనని స్పష్టం చేసింది.
గతంలో మణిరత్నం పిలిచి ఛాన్స్ ఇస్తానన్నా, విక్రమ్ సరసన నటించమని కోరినా … ఎంబీబీఎస్ చదువుతున్నానని సున్నితంగానే తిరస్కరించిన ఈ సుందరి సూర్య విషయంలో అన్ని రూల్స్ పక్కన పెట్టడం చూసి కోలీవుడ్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో ఎంసీఏ సినిమా చేస్తున్నారు. నాగ శౌర్యకి జోడీగా నటించడానికి సైన్ చేసింది. అలాగే విజయ్ దర్శకత్వంలో కరు అనే చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతోంది. ఈ చిత్రంతో సూర్యతో నటించే ఛాన్స్ పట్టేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













