Sai Pallavi: ‘లవ్ స్టోరీ’లో కిస్ సీన్ పై సాయి పల్లవి కామెంట్స్!

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో చిత్రబృందం సినిమాను మరింత ప్రమోట్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమాలో చైతు-సాయి పల్లవిల మధ్య ఓ కిస్ సీన్ ను చిత్రీకరించారు.

మెట్రో ట్రైన్ లో సడెన్ గా సాయిపల్లవి.. చైతుని ముద్దుపెట్టుకుంటుంది. ఈ సీన్ చాలా సహజం అనిపించింది. అయితే నిజంగా తను చైతుకి ముద్దుపెట్టలేదని.. కెమెరాలతో చేసిన చిన్న జిమ్మిన్ అని ఆమె వెల్లడించారు. తనకు ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదని.. అందుకే శేఖర్ కమ్ముల దానికి తగిన కెమెరాలను ఫిక్స్ చేసి.. నిజంగానే ముద్దుపెట్టినట్లుగా సీన్ తయారు చేశారని తెలిపారు. తనకు నచ్చనిది, ఇబ్బంది పెట్టే సీన్ ఏదీ కూడా శేఖర్ కమ్ముల తీయరని..

తన అభిప్రాయాలను గౌరవిస్తారని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. డాన్స్ సీన్ లో గాల్లోకి ఎగిరి నేలకు వాలిన సీన్ లో తానే స్వయంగా పైకి ఎగిరానని.. అయితే కెమెరా వర్క్ తో బాగా పైకి ఎగిరినట్లు చూపించారని చెప్పారు. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. సినిమాలు ఎన్నాళ్లు సాగితే అంతకాలం నటిస్తానని.. ఆ తరువాత మెడికల్ కెరీర్ లోకి వెళ్తానని తెలిపారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus