Sai Pallavi Sister Marriage: అంగరంగ వైభవంగా పూజా కన్నన్ పెళ్లి.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి (Sai Pallavi) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. సాయిపల్లవి రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా ఆమె డాన్స్ కు సైతం ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం సాయిపల్లవి తండేల్ (Thandel) సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా నటి సాయిపల్లవి ఇంట పెళ్లి వేడుక జరిగింది. సాయిపల్లవి సోదరి పూజా కన్నన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన వినీత్ ను పెళ్లి చేసుకున్నారు.

Sai Pallavi Sister Marriage

పూజాకన్నన్ , వినీత్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూజాకన్నన్, వినీత్ జోడీ బాగుందని ఈ జోడీ కలకాలం అన్యోన్యంగా జీవనం సాగించాలంటూ నెటిజన్లు, సాయిపల్లవి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సౌత్ ప్రేక్షకులకు పూజా కన్నన్ సైతం నటిగా సుపరిచితురాలే కావడం గమనార్హం.

అచ్చం సాయిపల్లవిలా (Sai Pallavi) కనిపించే పూజా కన్నన్ చితిరై సెవ్వానం అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 2021 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమాలో పూజాకన్నన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ ఏడాది జనవరిలో పూజా కన్నన్, వినీత్ ల నిశ్చితార్థం జరగగా తాజాగా పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్లి వేడుకలో సాయిపల్లవి సంప్రదాయ దుస్తుల్లో మెరవడంతో పాటు సోదరితో కలిసి అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేసి ప్రశంసలు అందుకున్నారు.

ఒక మరాఠి పాటకు సాయిపల్లవి (Sai Pallavi) సోదరితో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేశారు. సాయిపల్లవి డ్యాన్స్ లో గ్రేస్ ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాయిపల్లవి నటిగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సోదరి పెళ్లి వీడియోను సాయిపల్లవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు.

మెగా హీరోలపై అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags