Sai Pallavi: చైతూ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి?

  • September 21, 2023 / 04:24 PM IST

అక్కినేని హీరో నాగచైతన్య కస్టడీ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ లో డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ఫ్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నట్లు మనకు తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

నాగచైతన్య సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇలా మరోసారి నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే వీరిద్దరూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన లవ్ స్టోరీ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో మరోసారి ఇదే కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తున్నారని తెలియడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో నటించడం కోసం సాయి పల్లవి భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సాయి పల్లవి ఇప్పటివరకు తన కెరీర్లు తీసుకొనటువంటి రెమ్యూనరేషన్ ఈ సినిమాకు తీసుకోబోతుందని సమాచారం.

నాగచైతన్య సినిమా కోసం సాయి పల్లవి (Sai Pallavi) ఏకంగా ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి కెరియర్ లో ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ కావడం విశేషం. ఇక ఈ సినిమాకు నాగచైతన్య కేవలం ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా వీరిద్దరికీ కేవలం రెండు కోట్ల తేడా అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి వీరి రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus