Sai Pallavi: ఫీలవుతున్న సాయిపల్లవి ఫ్యాన్స్.. కానీ?

తెలుగులోని టాలెంటెడ్ హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరనే సంగతి తెలిసిందే. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు సాయిపల్లవికి నటిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ రెండు సినిమాలకు శేఖర్ కమ్ముల డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సాయిపల్లవి హీరోయిన్ గా సినిమా తెరకెక్కితే ఆ సినిమా హిట్ అని సాయిపల్లవి ఫ్యాన్స్ భావిస్తారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ హీరోగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా ఎంపికవుతారని పాన్ ఇండియా హీరోయిన్ గా సాయిపల్లవికి గుర్తింపు దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తారు. అయితే శేఖర్ కమ్ముల సాయిపల్లవిని కాకుండా బాలీవుడ్ హీరోయిన్ ను ఈ సినిమాలో ఎంపిక చేశారని సమాచారం. సీరియస్ సబ్జెక్ట్ తో శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. వరుస హిట్లతో జోరుమీదున్న సాయిపల్లవి తర్వాత సినిమా గురించి స్పష్టత రావాల్సి ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ కావడానికి కూడా ఒక విధంగా సాయిపల్లవి కారణమనే సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు సాయిపల్లవికి క్రేజ్ పెరుగుతున్నా సాయిపల్లవి మాత్రం పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సాయిపల్లవికి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. సాయిపల్లవి కొత్త ప్రాజెక్టులకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. స్టార్ హీరోలకు జోడీగా సాయిపల్లవికి నటించే ఛాన్స్ దక్కితే సాయిపల్లవికి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.

కథ నచ్చితే మాత్రమే సాయిపల్లవి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న నేపథ్యంలో సాయిపల్లవి పరిమితంగానే సినిమాలలో నటిస్తున్నారు. రీమేక్ సినిమాలకు, గ్లామరస్ రోల్స్ లో నటించడానికి సాయిపల్లవి నో చెబుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు రీమేక్ సినిమాలలో ఛాన్స్ ఇస్తున్నా ఆ ఆఫర్లను సాయిపల్లవి సున్నితంగా రిజెక్ట్ చేస్తుండటం గమనార్హం. సాయిపల్లవి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus