ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా.. తన నటనతో, డాన్స్ తో ప్రేక్షకులను మెప్పించిన నటి సాయి పల్లవికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందం విషయంలో తనకు కొన్ని భయాలు ఉండేవని చెప్పింది సాయి పల్లవి. కాలేజీ చదివే రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చానని.. అప్పుడు మిగతా సగటు అమ్మాయిల్లానే అందం విషయంలో తనకు కూడా కొన్ని భయాలుండేవని చెప్పింది.
అప్పటివరకు తాను చూసిన హీరోయిన్లంతా ముఖంపై ఎలాంటి మచ్చలు లేని అందమైన మోహమున్న వాళ్లేనని.. కాబట్టి తన ముఖంపై ఉన్న మొటిమల గురించి ప్రేక్షకులు ఎలా మాట్లాడుకుంటారోననే భావన ఉండేదని చెప్పింది. కానీ ‘ప్రేమమ్’ సినిమా విడుదలైన తరువాత తన ఆలోచనలన్నీ తప్పని అర్థమైందని చెప్పుకొచ్చింది.
పైకి కనిపించే అందం కంటే క్యారెక్టర్ ముఖ్యమని.. అందరూ అదే చూస్తారని అప్పుడు తెలిసిందని చెప్పుకొచ్చింది. ఇటీవలే నాగచైతన్య సరసన ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ మరో హిట్టును తన ఖాతాలో వేసుకుంది. అలానే ఈమె నటించిన ‘విరాటపర్వం’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గానే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది సాయి పల్లవి.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?