సాయిపల్లవి మళ్ళీ ఫిదా చేస్తుందా

తెలుగులో తొలి చిత్రమైన “ఫిదా”తోనే భానుమతిగా అశేష తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్న సాయిపల్లవి ఆ తర్వాత “మిడిల్ క్లాస్ అబ్బాయి” చిత్రంలోనూ తెలంగాణ ఆడపడుచుగా అలరించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తెలంగాణ పోరిగా నటించడానికి సన్నద్ధమవుతోంది సాయిపల్లవి. “నీదీ నాదీ ఒకే కథ”తో ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా ఆకట్టుకొన్న వేణు ఉడుగుల తన తదుపరి చిత్రంగా తెలంగాణ నేపధ్యంలో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ రాసుకొన్నాడు. ఆ కథ సాయిపల్లవికి విపరీతంగా నచ్చేసిందట. ఈ సినిమాలో నేనే హీరోయిన్ గా నటిస్తాను అని భీష్మించుకొని కూర్చుందట.

సాయిపల్లవికి స్క్రిప్ట్ నచ్చడంతో నిర్మాతలు కూడా రెడీ అయిపోయారు. ప్రస్తుతం హీరోను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు వేణు ఉడుగుల. ఇకపోతే ఈ చిత్రానికి “విరాఠపర్వం 1992” అనే టైటిల్ అనుకొంటున్నారట. గత కొన్ని సినిమాలతో కాస్త ఢీలాపడిన సాయిపల్లవి ఈ సినిమాతో మళ్ళీ నటిగా ప్రూవ్ చేసుకోవాలని తహతహలాడుతున్నదట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus