సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్.. వైరల్…!

‘ఫిదా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. ఆ చిత్రంతో హీరోకంటే కూడా ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం.. అందులోనూ సాయి పల్లవికి మేజర్ క్రెడిట్ దక్కడంతో ఈమెకు వరుస అవకాశాలు క్యూలు కట్టాయి. అయితే ఈమె మాత్రం సినిమాలో ఈమె పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమా ఓకే చేస్తుంది. అలా చాలా సినిమాలు ఈ బ్యూటీ వదిలేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాగ చైతన్య సినిమాలోనూ అలాగే రానా ‘విరాట పర్వం’ సినిమాలోనూ నటిస్తుంది. ఇక ఈమె క్రేజ్ కు ఎన్నో యాడ్స్ లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి.. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది కానీ ఈమె వాటిని చేయడానికి ఒప్పుకోలేదు.

ఆ విషయాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.. “జీవితంలో ఏదైనా అనుకున్న విషయం జరగకపోతే.. నిరాశ పడడం సహజం.. అయితే అలాంటి వాటిని నేను వేరే కోణంలో చూస్తాను. ఏది జరగాలని రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. అంతేకానీ ఆశించింది జరగలేదని నిరుత్సాహపడకూడదు. ఏం జరిగినా మన మంచికే అని భావించడం నాకు చదువుకునే రోజుల నుండే అలవాటు. ఇక డబ్బు కోసం ఏది పడితే అది చేయను. ఎంత సంపాదించినా.. రాత్రి ఇంటికి వెళ్ళి నేను తినేది మూడు చపాతీలే.. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ తింటామా..? సంతోషంగా, ఆత్మసంతృప్తితో జీవిస్తే చాలు. విలువలు చంపుకొని పని చేయడం నాకు నచ్చదు. అందుకే ఇటీవల కొన్ని యాడ్స్ చేసే ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేశాను” అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus