Sai Pallavi Remuneration: సాయిపల్లవి సంపాదన తెలిస్తే షాకవ్వాల్సిందే?

స్టార్ హీరోలకు జోడీగా ఎక్కువ సినిమాలలో నటించకపోయినా ఇండస్ట్రీలో సాయిపల్లవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాయిపల్లవి ఖాతాలో మరో సక్సెస్ చేరింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు సాయిపల్లవి కోటి రూపాయల నుంచి కోటిన్నర రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. అయితే ఈ బ్యూటీ సంపాదన ఇతర హీరోయిన్లు అనుష్క, సమంతలకు ధీటుగా ఉంది.

వరుసగా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకోవడంతో పాటు ఆ సినిమాలతో సాయిపల్లవి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా సాయిపల్లవికి ఆఫర్లు వస్తున్నాయి. యంగ్ హీరోలు ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా తమ సినిమాలలో సాయిపల్లవిని నటింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. సాయిపల్లవి నటించిన సినిమాలకు బిజినెస్ బాగా జరగడంతో పాటు డబ్బింగ్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి.

ఫిదాతో టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేసిన సాయిపల్లవి తక్కువ సినిమాలే చేసినా తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే నటీమణులలో సాయిపల్లవి కూడా ఒకరు. శ్యామ్ సింగరాయ్ లో దేవదాసి పాత్రలో సాయిపల్లవి అద్భుతంగా నటించారు. ఒక సర్వే ప్రకారం సాయిపల్లవి ఈ ఏడాది మూడు మిలియన్ డాలర్లు సంపాదించారు.

సాయిపల్లవి తక్కువ పారితోషికం తీసుకుంటున్నా ఎక్కువ సినిమాలలో నటిస్తూ ఇతర హీరోయిన్లకు ధీటుగా సంపాదిస్తున్నారు. పెద్ద సినిమా అయినా, రీమేక్ అయినా పాత్ర నచ్చకపోతే సాయిపల్లవి సున్నితంగా తిరస్కరిస్తున్నారు. గత మూడేళ్ల కాలంలో సాయిపల్లవి ఏకంగా నాలుగు సినిమాలను రిజెక్ట్ చేశారని సమాచారం.

యాడ్స్, రీమేక్ లలో నటించి ఉంటే సాయిపల్లవి సంపాదన మరింత ఎక్కువగా ఉండేది. సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. సాయిపల్లవి లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు సాయిపల్లవికి క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా సాయిపల్లవికి భారీస్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus