Nithiin: నితిన్‌ సినిమాలో సూపర్‌ ఫాస్ట్‌ గాళ్

నితిన్‌ అనగానే యంగ్‌ అండ్‌ ఎనర్జటిక్‌ బాయ్‌ గుర్తొస్తాడు. సినిమాల్లో చాలా యాక్టివ్‌గా కనిపిస్తుంటాడు. మధ్య మధ్యలో కొన్ని కూల్‌ అండ్‌ కామ్‌ సినిమాలు తీసినా యాక్టివ్‌ సినిమాలే చేశాడు. మరోవైపు సాయి పల్లవి పరిస్థితీ అంతే. ‘ప్రేమమ్‌’తో కూల్‌గా మొదలైనా… సూపర్‌ ఫాస్ట్‌ గాళ్‌ పాత్రలే చేస్తూ వస్తోంది. మరి ఈ ఇద్దరూ కలిస్తే… ఆ జోడీ సూపర్‌ ఉంటుంది కదా. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా… నితిన్‌ తర్వాతి సినిమా కోసం సాయిపల్లవి పేరు పరిశీలనలో ఉందట.

నితిన్‌ హీరోగా కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కిస్తాడని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందిస్తున్నాడని సమాచారం ఈ సినిమా కోసమే సాయి పల్లవిని ఎంపిక చేసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఆమెను సంప్రదించారట. అయితే ఆమె నుండి ఇంకా స్పందన రాలేదంట. ఇటీవల కాలంలో సాయిపల్లవి ఏ సినిమానీ అంత తొందరగా ఓకే చేయడం లేదు. దీంతో ఈ సినిమా విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

ఒకవేళ సాయిపల్లవి ఓకే చేస్తే… ఆమె వేగం, జోష్‌ ముందు నితిన్‌ నిలుస్తాడా? అనేదే ఇక్కడ ప్రశ్న. సాయిపల్లవి ట్రాక్‌ రికార్డు చూస్తే… చేసిన చాలా సినిమాల్లో ఆమె హుషారైన నటనతో డామినేషన్‌ చేసిందనే చెప్పుకోవాలి. ఒకటిరెండు సందర్భాల్లో కాస్త డౌన్‌ అయినట్లు కనిపించింది. మరి ఇప్పుడు నితిన్‌ సినిమాలో ఏం చేస్తుందో చూడాలి.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus