Sai Pallavi: నా నటన వారిపై ఆధారపడి ఉంటుంది: సాయి పల్లవి

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఫిదా సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫిదా సినిమాతోనే అందరిని ఆకట్టుకున్నటువంటి ఈమె తెలుగులో అనంతరం నటించిన సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే సాయి పల్లవి ఇలాంటి సినిమాలలో నటించడం పట్ల చాలామంది ఈమె కథల ఎంపిక విషయంపై ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు.

సాయి పల్లవి వద్దకు యాదృచ్ఛికంగా ఇలాంటి కథలు వస్తాయా లేదంటే తన సినిమా కథలు ఎంపిక చేసుకునేటప్పుడే ఇలాంటి సినిమాలను ఎంపిక చేసుకుంటారా అనే సందేహం కలుగుతుంది అయితే ఈ విషయంపై సాయి పల్లవి స్పందిస్తూ.. తాను ఒక పాత్రలో చేసేటప్పుడు ఇలానే చేయాలని నిబంధనలు ఏమి పెట్టుకోనని అయితే తాను ఒక సినిమాను ఎంపిక చేసుకున్నప్పుడు తన నటన తన కోస్టార్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

ఇలా నా పర్ఫామెన్స్ సెట్ వాతావరణం, తోటి నటులపై ఆధారపడి ఉంటుంది. అయితే నేను ఏ పాత్ర చేసిన 100% నా పాత్రకు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తానని ఈమె తెలిపారు. ఇకపోతే సాయి పల్లవి గార్గి సినిమా అనంతరం ఈమె ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు. దీంతో అభిమానులు సైతం సాయి పల్లవి సినిమాల గురించి కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగులో విరాటపర్వం అంటే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఈ సినిమా పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోయినా ఇందులో సాయి పల్లవి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.వెన్నెల పాత్రలో అందరిని మెప్పించిన సాయి పల్లవి ఈ సినిమా తర్వాత తెలుగులో ఎలాంటి సినిమా ప్రకటించకపోవడం గమనార్హం.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus