Sai Pallavi: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ విషయంలో సాయిపల్లవి సరికొత్త రికార్డ్.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. అయితే సాయిపల్లవి ఇప్పటివరకు నటించిన సినిమాలు 19 మాత్రమే అయినా అవార్డ్స్ విషయంలో సాయిపల్లవి (Sai Pallavi) అదుర్స్ అనిపిస్తున్నారు. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ విషయంలో సాయిపల్లవి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. సాయిపల్లవి ఇప్పటివరకు ఏకంగా 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు. దేశంలో మరే హీరోయిన్ ఈ స్థాయిలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను అందుకోలేదని సాయిపల్లవికి మాత్రమే ఈ అరుదైన ఘనత సాధ్యమైందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

సాయిపల్లవి ఖాతాలో సంచలన రికార్డ్ చేరడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. నూతన్ సమర్థ్, కాజోల్, అలియా భట్ వేర్వేరుగా ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకోగా వాళ్ల రికార్డ్ ను సాయిపల్లవి అధిగమించారు. ప్రేమమ్, ఫిదా (Fidaa) , శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) , లవ్ స్టోరీ (Love Story) , గార్గీ, విరాటపర్వం (Virata Parvam) సినిమాలకు సాయిపల్లవి ఈ అవార్డులను అందుకున్నారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సాయిపల్లవి అవార్డులను అందుకోవడం కొసమెరుపు.

సాయిపల్లవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అవుతుండగా తర్వాత సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. సాయిపల్లవి తండేల్, బాలీవుడ్ రామాయణ్ సినిమాలతో కెరీర్ పరంగా మరిన్ని మెట్లు పైకి ఎక్కాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉంటూ కూడా వరుస విజయాలను అందుకోవడం సాయిపల్లవికి సాధ్యమైందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాయిపల్లవి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. సాయిపల్లవి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది. సౌత్ హీరోయిన్లలో కొంతమంది హీరోయిన్లు మాత్రమే బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus