మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా, తన కఠోరమైన పట్టుదల, శ్రమ, కష్టంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. బన్నీ ప్రత్యేకత ఏంటంటే దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో నటించకుండా తెలుగు ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదగటం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 1&2 మూవీస్ తో అల్లు అర్జున్ సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. అందులో బన్నీ యాక్టింగ్ కు గాను జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు దక్కించుకున్నాడు అంటే బన్నీ తన నట విశ్వరూపాన్ని చూపించాడు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
పుష్ప 2 తరువాత బన్నీ ఏ మూవీలో నటిస్తారు అనేది అప్పటిలో హాట్ టాపిక్. ఆ రూమర్స్ కి తెరదించుతూ బన్నీ తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పటం, ఆ మూవీ షూటింగ్ చక చకా జరుగుతుంది. ఇది ఇలా ఉండగా కొత్తగా ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం బన్నీకి పాన్ ఇండియా లెవెల్లో హైప్ ఉండటంతో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. అయితే బన్నీ-అట్లీ మూవీ హాలీవుడ్ స్టాండర్డ్స్ లో నిర్మితమవుతుండగా ప్రొడక్షన్ బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగా వెళ్తుంది అంట. దీంతో బన్నీ తన రెమ్యూనరేషన్లో దాదాపుగా 30% తగ్గించుకొని సినిమా నిర్మాణానికి ఎక్కడా కాంప్రమైస్ అవ్వొద్దని నిర్మాతలకు తెలియజేసినట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా ఇంకో వార్త కూడా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఐబొమ్మ రవి పోలీసులకి పట్టుబడటంతో, టికెట్ రేట్లు తగ్గించాలని ప్రేక్షకుల నుంచి బాగా ఒత్తిడి వస్తుండటంతో, హీరోల రెమ్యూనరేషన్లు భారీగా ఉండటం వల్లనే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది అని అందుకే హీరో రెమ్యూనరేషన్ కొంత తగ్గించుకుంటే అంత సెట్ అవుతుందని, ఇదంతా గమనిస్తున్న హీరోలలో బన్నీ స్వయంగా తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నటు టాక్. ఇదే నిజమైతే స్టార్ హీరోలు అందరికి బన్నీ ఆదర్శంగా నిలవటం గ్యారెంటీ అంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.