NTR: ఎన్టీఆర్ తన లైనప్ తో డైరెక్టర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా…..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ప్రాజెక్టుల లైనప్‌ విషయంలో టాలీవుడ్‌ సినీ వర్గాల్లో పెద్ద చర్చకు తెరదీసాడు. దేవర ద్వారా ఫ్యాన్స్ అంచనాలను ఆకాశానికెత్తిన ఎన్టీఆర్, బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆ రేంజ్ కలెక్షన్స్ అందుకోలేకపోయాడు. ఆ తరువాత వచ్చిన వార్ 2 లో ఎన్ఠీఆర్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండటంతో అది కూడా అభిమానులను నిరాశపరిచింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. రీసెంట్ గా మాట్లాడుతూ “ఈ చిత్రం కేవలం నేషనల్ లెవల్ కాదు, ఇంటర్నేషనల్ రేంజ్‌లో కూడా ప్రభావం చూపుతుందని మైత్రి మూవీ మేకర్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు”.

NTR

అయితే నీల్ ప్రాజెక్ట్‌ తర్వాత ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాపై మాత్రం క్లారిటీ రాలేదని ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్. మొదట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మైథాలజికల్ సినిమా ఫిక్స్ అయినప్పటికీ, తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ కూడా లైన్ లోకి వచ్చాడని సమాచారం. రజినీకాంత్ జైలర్ 2 పూర్తయ్యాక నెల్సన్–ఎన్టీఆర్ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

త్రివిక్రమ్, నెల్సన్…. ఈ ఇద్దరిలో ముందుగా ఎవరి సినిమా సెట్స్‌కి వెళ్తుందో స్పష్టత లేకపోయినా, ఎన్టీఆర్ రెండింటినీ బ్యాలెన్స్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. నీల్ సినిమా రిలీజ్ తర్వాత ఇద్దరికీ డేట్స్ ఇచ్చి, రెండు ప్రాజెక్టులను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.మొత్తం మీద, వరుసగా ప్రశాంత్ నీల్, నెల్సన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్టులు రెడీగా ఉండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags