సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె నటించిన అది తక్కువ సినిమాలో అయినప్పటికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఎలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ నిర్మాణంలో కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి పల్లవి (Sai Pallavi) టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరో గురించి అలాగే ఆ హీరో కోసం ఈమె రిస్క్ చేసి ఇంట్లో తన్నులు తిన్న విషయాలను అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ తాను ఇంటర్ సెకండియర్ చదువుతున్న సమయంలో తనకు ఎంతో ఇష్టమైనటువంటి హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమాని చూడటం కోసం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా థియేటర్ కు వెళ్లాను.
అయితే సినిమా చూసి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాను ఎవరు తోడు లేకుండా సినిమా చూడటం కోసం వెళ్లి ఆలస్యంగా రావడంతో తన తండ్రి చేతిలో బాగా తన్నులు తిన్నానని తెలిపారు. సినిమాకి వెళ్లాలని చెబితే మేమే తీసుకు వెళ్లే వాళ్ళం కదా ఇలా ఒంటరిగా వెళ్లడం దేనికి అంటూ చివాట్లు కూడా పెట్టారు.ఇలా తనకెంతో ఇష్టమైనటువంటి హీరో పవన్ కళ్యాణ్ కోసం తాను తీసుకున్నటువంటి అతిపెద్ద రిస్క్ ఇదేనని సాయి పల్లవి తెలియజేశారు.
ఇక సినిమాలలోకి వచ్చిన తర్వాత తనని ఫిదా సమయంలోనే మొదటిసారి కలిశానని అప్పటివరకు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భాలు లేవు అంటూ ఈ సందర్భంగా సాయి పల్లవి పవన్ కళ్యాణ్ పై ఉన్నటువంటి ఇష్టాన్ని తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.