Sai Pallavi: నాన్న తెలుగబ్బాయిని పెళ్లి చేసుకో అంటారు: సాయి పల్లవి

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన భాషతో నటనతో అందరిని ఫిదా చేసిందని చెప్పాలి.ఈ విధంగా తన అద్భుతమైన నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న సాయిపల్లవి ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా ఈమె రానా దగ్గుబాటితో కలిసి విరాటపర్వం సినిమా ద్వారా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె కార్యక్రమంలో ఈమె పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా సాయిపల్లవి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. తాను తమిళనాడులో ఒక మారుమూల గ్రామంలో జన్మించినప్పటికీ తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారని చెప్పగా,తాను ఇంట్లో ఉన్నప్పుడు బడగ మాట్లాడతానని,ఇలా కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడే సమయంలో కొన్నిసార్లు తెలుగులో మాట్లాడుతానని తెలిపారు.

ఈ విధంగా తెలుగులో మాట్లాడేటప్పుడు తన నాన్న నువ్వు ఎవరినైనా తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకో అంటుంటారని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలియజేశారు. ఇక పోతే తాను 23 సంవత్సరాలకు పెళ్లి చేసుకొని 30 ఏళ్లకు ఇద్దరు పిల్లలు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇకపోతే తమిళనాడులో పుట్టిన తనకు సాయి పల్లవి అనే పేరు పెట్టడం వెనుక కారణం కూడా తెలిపారు.

తాను పుట్టపర్తి సాయి బాబా ఆశీస్సులతో జన్మించానని అందుకే సాయిబాబా పేరు వచ్చేలా బాబా ఆశీర్వదించి తనకు సాయి పల్లవి అనే పేరు పెట్టారని ఈ ఇంటర్వ్యూలో సాయి పల్లవి తెలియజేశారు. ప్రస్తుతం సాయి పల్లవికి సంబంధించిన ఈ ప్రోమో ఎంతో సరదాగా సాగి పోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus