Sai Pallavi, Pawan Kalyan: ఆ రీజన్ వల్లే పవన్ ఇష్టమన్న సాయిపల్లవి!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవిని కొందరు అభిమానులు ప్రేమగా లేడీ పవర్ స్టార్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. సాయిపల్లవి, రానా జోడీగా నటించిన విరాటపర్వం సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలు కాగా మల్టీప్లెక్స్ లలో ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. సాయిపల్లవి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వెన్నెల పాత్రతో సాయిపల్లవి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా క్యాష్ షో ప్రోమో రిలీజ్ కాగా విరాటపర్వం టీం క్యాష్ షోకు హాజరై సందడి చేశారు. సాయిపల్లవితో పాటు నవీన్ చంద్ర, దర్శకుడు వేణు ఊడుగుల, ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర ఈ షోకు హాజరయ్యారు. ఈ షోలో సాయిపల్లవి వచ్చిందే పాటకు డ్యాన్స్ చేసి సందడి చేశారు. సాయిపల్లవి సుమతో నిన్న చూస్తే ఆడియో లాంఛ్ లో ఉన్నారని ఈరోజు చూస్తే ఇక్కడ ఉన్నారని ప్రశ్నించగా ఎక్కడ చూసినా నేనే ఉంటానని సుమ తెలిపారు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటోను షోలో చూపించగా సాయిపల్లవి ఆ ఫోటోను చూస్తూ సిగ్గు పడ్డారు. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అయినా ఆ విధంగా ఫీల్ కారని ఆమె అన్నారు. సాధారణ వ్యక్తిలా ఆయన వెళ్లిపోతారని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. మనస్సులో ఏమని అనిపిస్తే అది ఆయన బయటకు చెప్పేస్తారని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

అందువల్ల పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని సాయిపల్లవి కామెంట్లు చేశారు. సాయిపల్లవిని మీరు దేనికి ఎక్కువగా భయపడతారని అడగగా నేనంటే నాకు చాలా భయమని ఆమె తెలిపారు. నేను లవ్ ను ఫీలైతే యాక్సెప్ట్ చేస్తానని ఆమె తెలిపారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus