Pooja Kannan: సాయి పల్లవి చెల్లి ఎమోషనల్ పోస్ట్ వైరల్ !

  • May 10, 2023 / 10:56 AM IST

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమమ్’ చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది సాయి పల్లవి. ఆ చిత్రంలో మలార్ అనే లెక్చరర్ పాత్రలో ఈమె చాలా చక్కగా నటించింది. డాన్స్ కూడా ఇరగదీసేసింది. అందుకే వెంటనే ఈమె టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తే బాగుణ్ణు అని తెలుగు ప్రేక్షకులు ఆశపడ్డారు. ఆ ముచ్చటని దర్శకుడు శేఖర్ కమ్ముల ‘ఫిదా’ చిత్రంతో తీర్చాడు. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. తర్వాత తెలుగులో కూడా బిజీ హీరోయిన్ అయిపోయింది సాయి పల్లవి.

‘ఎం.సి.ఎ’ ‘లవ్ స్టోరీ’ ‘శ్యామ్ సింగరాయ్’ వంటి హిట్ చిత్రాలతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. గ్లామర్ షో చేస్తేనే హీరోయిన్లు స్టార్లుగా ఎదుగుతారు అనే సెంటిమెంట్ ను సాయి పల్లవి బ్రేక్ చేసింది. ప్రస్తుతం సాయి పల్లవికి బోలెడన్ని ఆఫర్లు వస్తున్నా.. ఆమె ఏ సినిమాకి ఓకే చెప్పడం లేదు. తనకు నచ్చిన పాత్రలకే ఆమె ఓకే చెబుతుంది. ప్రస్తుతం శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు. దీంతో టాలీవుడ్ స్టార్లంతా ఈమెకు బర్త్ డే విషెష్ చెబుతూ ట్వీట్లు పెడుతున్నారు.

ఈ క్రమంలో సాయి పల్లవి చెల్లెలు (Pooja Kannan) పూజ పోస్ట్ వైరల్ గా మారింది. ‘ఈ రోజు నిన్ను మిస్ అవుతున్నాను.. నువ్వు నా పక్కన లేవని, నేను నీ పక్కన లేను.. ఎంతగానో మిస్ అవుతున్నా.. నిన్ను ఇరిటేట్ చేయడం మిస్ అవుతన్నా.. నిన్ను గిచ్చడం, నీ మొహం ఎర్రగా అవ్వడం చూడలేకపోవడం కూడా మిస్ అవుతున్నా.. నీతో కూర్చుని నవ్వుకోవడం మిస్ అవుతున్నాను..మిస్ యూ.. నా కంటే ముందు పుట్టి..నా మీద పడాల్సిన నిందలను నువ్వు మోస్తున్నందుకు థాంక్స్.. నీ మీద పడుకునే అవకాశం ఇస్తావ్.. అందుకు థాంక్యూ..

నీ కోసం నువ్వు తీసుకునే డ్రెస్సులు చివరకు నా కప్ బోర్డులకు వస్తాయ్.. ఈ జోకులన్నీ పక్కన పెట్టేస్తే.. నువ్వు నా కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేను.. ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.. నన్ను బాధపెట్టే విషయాల నుంచి ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటున్నందుకు థాంక్స్.. నాలోని బెస్ట్ ఇచ్చేందుకు ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటావ్.. అక్కగా నువ్వు నాకు దొరకడం లక్కీ.. ప్రేమకు, స్వచ్చతకు నువ్వే ప్రతిరూపం.. హ్యాపీ బర్త్ డే బెస్ట్ ఫ్రెండ్.. మనం కొన్ని మంచి, డీసెంట్ ఫోటోలను దిగాలి’ అంటూ పేర్కొంది సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus