Pooja Kannan: ప్రియుడిని పరిచయం చేసిన పూజా కన్నన్?

టాలీవుడ్ ఇండస్ట్రీ లేడీ పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోకి ఫిదా సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మందిని ఆకట్టుకున్నారు. కథల ఎంపిక విషయంలో సాయి పల్లవి తీరు కాస్త భిన్నం అని చెప్పాలి వచ్చిన అవకాశాలు అన్నింటిని ఉపయోగించకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలలో మాత్రమే నటిస్తూ ఉంటారు.

ఇక సాయి పల్లవికి ఒక సోదరి ఉన్నారని తన పేరు పూజా కన్నన్ ఈమె కూడా తమిళ సినిమాలలో నటించారనే విషయం మనకు తెలిసిందే. ఇలా పలు సినిమాలలో నటించినటువంటి పూజ అచ్చం సాయి పల్లవి పోలికలతోనే ఉంటారు. ఇకపోతే తాజాగా ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది అక్క కంటే ముందుగానే చెల్లి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సాయి పల్లవి సోదరి పూజ ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారని అయితే తాజాగా ఆ వ్యక్తితో కలిసి దిగినటువంటి ఫోటోలను ఈమె షేర్ చేస్తూ తన గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన పేరు వినీత్ అని పూజ తెలియజేశారు ఇప్పటివరకు క్రైమ్ పార్ట్నర్ గా ఉన్నటువంటి తాను లైఫ్ పార్టనర్ గా మారబోతున్నారు అంటూ ఈమె తన పేరు గురించి తెలియజేశారు.

ఇలా తన ప్రియుడు వినీత్ ను పూజ (Pooja Kannan) పరిచయం చేశారు కానీ ఆయన ఏం చేస్తారు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉండటంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పూజ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus