టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ రేస్ లో రష్మిక మందన్నా (Rashmika Mandanna), సాయి పల్లవి (Sai Pallavi) ఇద్దరూ తమదైన స్థానం సాధించారు. ఒక్కసారి హిట్ కొడితే హీరోయిన్లకు అవకాశాలు పెరిగిపోతాయి, అదే ఫామ్ కొంతకాలం కొనసాగితే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ పెరుగుతుంది. ఈ విషయంలో రష్మిక, సాయి పల్లవి ఇద్దరూ ఇండస్ట్రీని వేరే కోణంలో ఏలుతున్నారు. కానీ వీరిద్దరిలో ఎవరు నిజమైన బాక్సాఫీస్ క్వీన్ అనేది ఫిల్మ్ లవర్స్ కి ఇంట్రెస్టింగ్ డిబేట్ అయింది.
తండేల్ (Thandel) సినిమాతో సాయి పల్లవి తొలిసారి పాన్ ఇండియా రేంజ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు మరిన్ని బిగ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘రామాయణం’ సినిమాలో సీతగా నటించే అవకాశం దక్కించుకుంది. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రామ్ పాత్రలో నటిస్తున్న ఈ భారీ సినిమాకి నితీశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవికి ఉత్తరాదిలో ఫ్యాన్ బేస్ పెంచుకునే అద్భుతమైన అవకాశం ఇది. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఎక్కువగా రష్మిక పేరు వినిపించినా, రామాయణం తర్వాత సాయి పల్లవి స్థానం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆమె చేసిన సినిమాలన్నీ ఇప్పటివరకు కంటెంట్ పరంగా బలమైనవి. గ్లామర్ పరంగా లిమిటెడ్ గా కనిపించినా, తన పెర్ఫార్మెన్స్ తోనే ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ తీసుకుంది. కాబట్టి, గ్లామర్ ఓపెన్ చేసి మాస్ అట్రాక్షన్ తెచ్చుకున్న రష్మిక, మాస్ సబ్జెక్ట్ లు కాకుండా, పెర్ఫార్మెన్స్ ఆధారంగా క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి.. ఇద్దరూ ఇండస్ట్రీలో సత్తా చాటుతూనే ఉన్నారు. ఎవరు నెంబర్ వన్ అనేది రెమ్యునరేషన్ పరంగా చూస్తే దాదాపు ఇద్దరు ఒకే ట్రాక్ లో 2 నుంచి 3 కోట్ల మధ్యలో అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కావున నెంబర్ వన్ అనే ట్యాగ్ పై క్లారిటీ రావాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.