Sai Pallavi,Jr NTR: తారక్‌ కోసం కొరటాల హీరోయిన్‌ను ఫిక్స్‌ చేసేశారా?

రెండు పవర్‌ హౌస్‌లు ఒక్క దగ్గర ఉంటే ఏమవుతుంది. హై ఓల్టేజ్‌ పవర్‌ జనరేట్‌ అవుతుంది. అదే రెండు పవర్‌ హౌస్‌ లాంటి నటులు ఓ సినిమాలో చేస్తే అదిరిపోయే అవుట్‌పుట్‌ వస్తుంది. ఇప్పుడు అలాంటి సినిమాకు రంగం సిద్ధమవుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అయితే సినిమా టీమ్‌ ఆలోచిస్తున్న దాని ప్రకారం అయితే ఈ పుకారు నిజమయ్యే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పాలి. అదే ఎన్టీఆర్‌ సినిమాలో సాయిపల్లవి. సూపర్‌ కాంబినేషన్‌ కదా.

టాలీవుడ్‌లో చాలామంది చూడాలనుకునే కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ – సాయిపల్లవి ఒకటి. ఇద్దరూ అద్భుతమైన నటులే. తమకు ఇచ్చిన పాత్రలకు వందకు రెండొందల శాతం న్యాయం చేసే వరకు విడిచిపెట్టరు. ఎన్టీఆర్‌ నటనలో వైవిధ్యాన్ని చాలా ఏళ్ల నుండి చూస్తున్నాం. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్‌’లో కూడా చూశాం. ఇక సాయిపల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువ. ‘ఫిదా’లో సింగిల్‌ పీస్‌ బానుమతిగా కుర్రకారు నచ్చేసింది. ఆ తర్వాత అన్నీ అద్భుతమైన పాత్రలే. రీసెంట్‌గా ‘శ్యామ్‌ సింగ రాయ్‌’లోనూ అదరగొట్టింది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా నానుతున్న ఈ సినిమా అధికారిక అనౌన్స్‌మెంట్‌ ఇటీవల తారక్‌ జన్మదినం సందర్భంగా ఇచ్చారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రోజుకొక పేరు బయటికొస్తోంది. ఇప్పుడు సాయిపల్లవి పేరును తీసుకొచ్చారు. సినిమాలో హీరోయిన్‌ పాత్ర కూడా బలంగా ఉంటుందని, అందుకే సాయిపల్లవి అయితే బాగుంటుందని అనుకుంటున్నారని టాక్‌.

ఆలియా భట్‌ లాంటి బాలీవుడ్‌ నటిని పెట్టి పాన్‌ ఇండియా మైలేజ్‌ను వర్కౌట్‌ చేద్దామనుకుంటోంది కొరటాల శివ టీమ్‌. అలాంటి సమయంలో ఇలా సాయిపల్లవిని తీసుకుంటారా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. బాలీవుడ్‌ హీరోయిన్‌తో పోలిస్తే సాయిపల్లవి తీసుకొచ్చే పాన్‌ ఇండియా మైలేజ్‌ తక్కువే. అలాగే గ్లామర్‌ పాత్రలకు ఆమె చాలా దూరం. ఈ నేపథ్యంలో ఈ పుకారు నిజమవుతుందా? అనేది చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus