అక్కలానే చెల్లెలు కూడా బిజీ అవుతుందా..?

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సాయి పల్లవి. గ్లామర్ షో చేయకుండా.. నటనను నమ్ముకుంటూ సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ.. భారీ రెమ్యునరేషన్ అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. ఇప్పుడు సాయి పల్లవిలా ఉండే మరో హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలోకి రానుంది. తనే పూజా కన్నన్. సాయి పల్లవికి సొంత చెల్లెలు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన చెల్లెలుతో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తుంటుంది సాయి పల్లవి.

ఆ ఫోటోలు చూసిన వారికి ఇద్దరూ ఒకేలా ఉన్నారనిపిస్తుంది. సాయిపల్లవికి జిరాక్స్ కాపీ పూజా కన్నన్ అంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు పూజా కూడా తన సోదరిలానే హీరోయిన్ గా సినిమాలు చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో తన తొలి సినిమాకి సంబంధించిన అగ్రిమెంట్ మీద సంతకం చేసింది. తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది పూజా. కొరియోగ్రాఫర్ స్టంట్ సిల్వా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఆయన సినిమాలో హీరోయిన్ గా పూజాను ఎంపిక చేశారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు విజయ్.. కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

సముద్రఖని ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. పూజా కన్నన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా చేయబోతోందని సమాచారం. అయితే సినిమా ఇండస్ట్రీలో అక్క హీరోయిన్ అయితే చెల్లెల్లు రాణించిన సందర్భాలు పెద్దగా లేవు. ఆర్తి అగర్వాల్, కాజల్ లాంటి హీరోయిన్ల చెల్లెల్లు కూడా నటీమణులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. కనీసం పూజా కన్నన్ అయినా.. ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి.. అక్క మాదిరి బిజీ అవుతుందేమో చూడాలి!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

 

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus