సాయిరామ్ శంకర్ హీరోగా ‘రిసౌండ్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా ఎస్.ఎస్. మురళీకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు. ఇదివరకు లాక్‌డౌన్ అనంతరం హైదరాబాద్‌లో షూటింగ్ పునరుద్ధరించి, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒంగోలులో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని ప్రధాన ఘట్టాలతో పాటు రెండు పాటలను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ‘రిసౌండ్’ టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇందులో ఓవైపు ఎంటర్‌టైన్ చేస్తూ, మరోవైపు యాక్షన్‌తో అలరించే పాత్రను సాయిరామ్ శంకర్ చేస్తున్నారు. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగస్తి సంగీతం సమకూరుస్తున్నారు.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!