Sai Rajesh : డైరెక్టర్ కాకముందు ఇండస్ట్రీ కోసం సాయి రాజేష్ అలాంటి పని చేసేవారా?

హృదయ కాలేయం సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు సాయి రాజేష్ ఇలా సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించి ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. అయితే తాజాగా సాయి రాజేష్ బేబీ సినిమాకు దర్శకత్వం వహించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బేబీ.ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది.

ఈ సినిమా ద్వారా సాయి రాజేష్ దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత సాయి రాజేష్ తన తదుపరి సినిమాల గురించి ఎలాంటి ప్రకటన తెలియజేయలేదు.ఇదిలా ఉండగా సాయి రాజేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక నేటిజన్ మీరు ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సాయి రాజేష్ సమాధానం చెబుతూ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

తాను (Sai Rajesh) సినిమాలలోకి రాకముందు సినిమా ఇండస్ట్రీ కోసం చాలా చేశానని తెలియజేశారు. నా చదువు, లైఫ్, కెరీర్ పోయినాసరే టాలీవుడ్ బాగుండాలని ఫ్యాన్ వార్స్ చేసేవాడిని అంటూ ఈయన చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది. సాయి రాజేష్ చిరంజీవికి వీరాభిమాని అనే విషయం తెలియజేశారు. చిరంజీవి సినిమాలు కనుక విడుదలయితే ఎన్నో సార్లు చొక్కాలు కూడా చింపుకున్నానని ఈయన చిరంజీవిపై తనకు ఉన్నటువంటి అభిమానాన్ని తెలిపారు. ఇక ట్విట్టర్ నుంచి కూడా ఎందుకు దూరమయ్యారు అంటూ ప్రశ్నించగా మూడు నెలల పాటు తాను ట్విట్టర్లో లాగిన్ కాకపోవడంతో వారే తీసేసారు అంటూ సమాధానం చెప్పారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus