Sai Tej: అంబటిని కాదట అతనిని ఉద్దేశించి ఆ రోల్ తీశారట.. తేజ్ ఏమన్నాడంటే?

ఈ ఏడాది విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయితేజ్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నామనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే శ్యామ్ బాబు అనే రోల్ వల్ల బ్రో మూవీ వివాదంలో చిక్కుకుంది. బ్రో మూవీ విషయంలో అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి, బ్రో మూవీ పెట్టుబడుల గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే శ్యామ్ బాబు పాత్ర గురించి ప్రశ్నలు ఎదురైన నేపథ్యంలో సాయితేజ్ (Sai Tej) తనదైన శైలిలో స్పందించి సమాధానం ఇచ్చారు. తన పీఆర్ టీంలో ఒక వ్యక్తి ఆధారంగా ఆ పాత్రను క్రియేట్ చేయడం జరిగిందని సాయితేజ్ అన్నారు. అంబటిని ఉద్దేశించి ఆ పాత్రను క్రియేట్ చేయలేదని సాయితేజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాయితేజ్ క్లారిటీతో సమస్య పరిష్కారం అవుతుందేమో చూడాల్సి ఉంది.

మరోవైపు బ్రో సినిమా కమర్షియల్ లెక్కలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. కొన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినా అన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం సులువు కాదు. సెకండ్ వీకెండ్ పైనే ఈ సినిమా ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంది. థియేటర్లలో బేబీ మూవీ స్ట్రాంగ్ గా ఉండటం బ్రో మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది. సముదఖనికి ఈ సినిమా వల్ల కెరీర్ కు పెద్దగా లాభం లేదు.

సముద్రఖనికి పవన్, సాయితేజ్ రూపంలో అద్భుతమైన అవకాశం లభించిందని అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో సముద్రఖని ఫెయిల్ అయ్యారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్లపై సముద్రఖని ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా మంచి కథలతో సినిమాలను నిర్మించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus