Sai Tej: ఆ సంస్థతో ప్రత్యేకమైన అనుబంధం.. సాయితేజ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరో సాయితేజ్ (Sai Tej)కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉండగా సాయితేజ్ కు ఈ మధ్య కాలంలో విరూపాక్ష తప్ప భారీ హిట్లు లేవనే సంగతి తెలిసిందే. సాయితేజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ హిట్లను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. విజయవాడ వాంబే కాలనీలో వరద బాధితులను తాజాగా సాయితేజ్ పరమర్శించారు. వాంబే కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి సాయితేజ్ వివరాలు తెలుసుకున్నారు.

Sai Tej

వృద్ధాశ్రమంలో వరద బాధితుల వృద్ధుల సహాయం కోసం సాయితేజ్ ఏకంగా 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తాను వరద బాధితులను పరామర్శించడానికి మాత్రమే విజయవాడకు వచ్చానని ఆయన అన్నారు. ప్రజల ముప్పు నుంచి త్వరగా కోలుకోవాలని తాను దుర్గమ్మను ప్రార్థించానని సాయితేజ్ కామెంట్లు చేశారు. వరద బాధితులకు నా వంతు సహకారం అందిస్తానని బాధితులను రక్షించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని ఆయన తెలిపారు.

అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని సాయితేజ్ వెల్లడించారు. కొన్నిరోజుల క్రితం సాయితేజ్ వరద బాధితుల కోసం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన చెక్కును సాయితేజ్ నారా లోకేశ్ ను కలిసి అందజేశారు. సాయితేజ్ (Sai Tej) ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో మంచి మనస్సును చాటుకోవడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సాయితేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. సాయితేజ్ రేంజ్ అంతకంతకూ పెరగాలని అభిమానులు సైతం భావిస్తున్నారు. సాయితేజ్ రాబోయే రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో సాయితేజ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సాయితేజ్ (Sai Tej) సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది.

సినిమా షూట్‌ ఎప్పుడో తెలియదు.. మిగిలిన పనులు పూర్తవుతున్నాయిగా..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus