ప్రభాస్ రామాయణంలో అతడు రావణుడు!

రామాయణం ఆధారంగా ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న సినిమా ‘ఆది పురుష్’. దర్శక నిర్మాతలు ఎక్కడా నేరుగా రామాయణాన్ని తీస్తున్నామని చెప్పడం లేదు. కానీ, పరోక్షంగా రామాయణమే అని పాత్రల పేర్లు, పోస్టర్ల ద్వారా చెబుతున్నారు. ఈ చిత్రంలో ప్రభు రామ్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ప్రభు రామ్ అంటే రఘురాముడు అన్నమాట. రాముడి అర్ధాంగి సీతాదేవిని అపహరించే రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు, హీరోయిన్ కరీనాకపూర్ భర్త సైఫ్ అలీఖాన్ నటించనున్నారు. లంకేష్ పాత్రలో సైఫ్ నటిస్తారని ఈరోజు ‘ఆది పురుష్’ చిత్రబృందం ప్రకటించింది.

వైవిధ్యమైన పాత్రలు చిత్రాలతో నటుడిగా తానేంటో సైఫ్ నిరూపించుకున్నారు. ప్రభాస్ సత్తా ఏంటో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు తెలిసింది. వీళ్లిద్దరి మధ్య పోరాటం ఆసక్తికరంగా ఉంటుందని ఊహించవచ్చు. “గొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సైఫ్ తో నటించడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నాను” అని ప్రభాస్ అన్నారు.సైఫ్ అలీ ఖాన్, దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్ లో ‘ఆది పురుష్’ రెండో సినిమా.‌ దర్శకుడి గత సినిమా ‘తానాజీ’లోనూ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు.

‘ఆది పురుష్’ నిర్మిస్తున్న టి సిరీస్ భూషణ్ కుమార్ ఆ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’లో ప్రభాస్ నటిస్తున్నారు. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం ఒక సినిమా చేయమన్నారు. వచ్చే ఏడాది ‘ఆది పురుష్’ చిత్రీకరణ ప్రారంభించి 2022లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus