Saitej,Balakrishna: ఆ సినిమాతో సాయితేజ్ విరూపాక్షను మించిన సక్సెస్ అందుకుంటారా?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సాయితేజ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. విరూపాక్ష సక్సెస్ తో సాయితేజ్ రేంజ్, మార్కెట్, క్రేజ్ అంచనాలకు మించి పెరిగింది. సాయితేజ్ సంపత్ నంది కాంబినేషన్ లో ఒకింత భారీ బడ్జెట్ తో గాంజా శంకర్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. మెగా హీరోలు రూటు మార్చి భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. గంజాయి చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా సాయితేజ్ ఈ సినిమాతో విరూపాక్షను మించిన సక్సెస్ అందుకుంటారా అనే చర్చ జరుగుతోంది.

సంపత్ నంది టాలెంటెడ్ డైరెక్టర్ కావడంతో పాటు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లలో ఒకరు కావడం గమనార్హం. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయితేజ్ గతంలో మొహమాటం వల్ల కొన్ని సినిమాలలో నటించి వరుస ఫ్లాపులతో కెరీర్ పరంగా ఇబ్బందులు పడ్డారు. ఇకపై కెరీర్ విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా సాయితేజ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సాయితేజ్ కెరీర్ పరంగా వరుస విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నాయి. కథ నచ్చితే సాయితేజ్ మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తున్నారు. బ్రో సినిమా మరీ భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోకపోయినా నిర్మాతలకు మాత్రం ఈ సినిమా మంచి లాభాలను అందించింది. సీటీమార్ తర్వాత సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

సాయితేజ్ తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది. సాయితేజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇతర భాషల్లో కూడా సాయితేజ్ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గాంజా శంకర్ సినిమాలో సాయితేజ్ తెలంగాణ యాసలో మాట్లాడతారని తెలుస్తోంది. భగవంత్ కేసరిలో బాలయ్య తెలంగాణ యాసలో మెప్పించినట్టుగా సాయితేజ్ కూడా తెలంగాణ యాసలో మెప్పిస్తారేమో చూడాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus