నందమూరి బాలకృష్ణ ఒక వ్యక్తి చీటింగ్ కు పాల్పడడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ‘బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్’ పేరుతో అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి విరాళాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నాడట. బసవతారకం హాస్పిటల్ యాజమాన్యం అనుమతి లేకుండా ఇలా జనాలను చీటింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ బాలయ్య టీం ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఓ లేఖను విడుదల చేసింది.
ఈ లేఖ ద్వారా బాలయ్య స్పందిస్తూ.. “మా ప్రమేయం లేకుండా ‘బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్’ పేరుతో అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి ప్రజలను చీటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. నా పేరు అలాగే బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతి లేకుండా వాడుతూ విరాళాల సేకరించేందుకు సిద్దమయ్యాడు. దీంతో నాకు కానీ బసవతారకం యాజమాన్యానికి గాని ఎటువంటి సంబంధం లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం తెలుపలేదు. దయచేసి ఇలాంటి మోసపూరిత కార్యక్రమాల పట్ల జాగ్రత్త వహించండి. బసవతారకం హాస్పిటల్ తరఫున ఎటువంటి సేవా కార్యక్రమాలు, విరాళాల సేకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించినా.. ముందుగా యాజమాన్యం అధికారికంగా ప్రకటిస్తుంది” అంటూ పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. అలాగే క్రిష్, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో కూడా బాలయ్య సినిమాలు చేసే అవకాశం ఉంది.