ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా ఈ సినిమా టెక్నీషియన్లు సైతం ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. సలార్ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన భువన్ గౌడ కేజీఎఫ్, సలార్ ఒకే సెట్ లో తీశారనే సందేహాలకు సైతం చెక్ పెట్టారు. సలార్ సినిమా కేజీఎఫ్ మూవీతో పోల్చి చూస్తే స్కేల్ కేన్వాస్ పరంగా ఎన్నో రెట్లు ఎక్కువని ఆయన అన్నారు.
ఈ సినిమా కోసం భారీ సెట్ వర్క్ ను ఉపయోగించామని 100 ఎకరాలలో ప్రైవేట్ సెట్ వేసి షూట్ చేశామని అన్నారు. మైలారం ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిగిందని ఆయన వెల్లడించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సైతం సలార్ షూట్ జరిగిందని డార్క్ సెట్లను ఉపయోగించడం ద్వారా కేజీఎఫ్ సెట్లతో పోలిక వచ్చి ఉండవచ్చని భువన్ గౌడ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ట్రైలర్ విజువల్స్ తో సలార్ సినిమా గురించి అంచనా వేయలేరని భువన్ గౌడ వెల్లడించారు.
సలార్ సినిమా బుకింగ్స్ మొదలైతే మాత్రం ఈ సినిమా సంచలనాలు తెలుగు రాష్ట్రాల్లో సైతం మొదలయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. సలార్ సినిమాకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. సలార్ సినిమాకు సంబంధించి కేజీఎఫ్ తో లింక్ లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని భారీ రికార్డులను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.
సలార్ (Salaar) సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!