Salaar: ఆ ఏరియాలో100 కోట్లు..కొల్లగొట్టిన సలార్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది. ప్రతి ఒక్క ఏరియాలోను భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ మంచి సక్సెస్ అందుకుంది

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి ఈ స్థాయిలో ఎలాంటి సినిమా సక్సెస్ అందించలేకపోయింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచాయి. కానీ ఈ సినిమా మాత్రం అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈ సినిమా నైజాం ఏరియాలో రాబట్టిన కలెక్షన్స్ కి సంబంధించినటువంటి పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నైజం ఏరియాకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు కొనుగోలు చేశారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ ఏరియాలో భారీ స్థాయిలోనే కలెక్షన్స్ రావటం విశేషం. ఈ సినిమా విడుదల అయ్యి రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే నైజాం ఏరియాలో ఈ సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.

ఇదే విషయాన్ని మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అవ్వడంతో పార్ట్ 2 పై కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా (Salaar) కూడా త్వరలోనే షూటింగ్ జరుపుకోబోతుంది అంటూ నిర్మాత వెల్లడించారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus