ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ అనే భారీ బడ్జెట్ సినిమా వచ్చింది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న రిలీజ్ అయ్యింది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ సో సోగానే ఉన్నా, పాటలు కూడా జస్ట్ ఓకే అనిపించినా, సినిమా పై మాత్రం మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది.దీంతో మొదటి వారం అద్భుతంగా కలెక్ట్ చేసింది . మూడో వారంలో కూడా కొంతవరకు బాగానే కలెక్ట్ చేసింది. కొత్త సినిమాలు వచ్చినా కొన్ని షోలు సలార్ కి కేటాయించారు. ఒకసారి 22 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 71.00 cr |
సీడెడ్ | 22.03 cr |
ఉత్తరాంధ్ర | 16.98 cr |
ఈస్ట్ | 9.76 cr |
వెస్ట్ | 7.09 cr |
గుంటూరు | 9.27 cr |
కృష్ణా | 7.37 cr |
నెల్లూరు | 4.76 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 148.26 cr |
కర్ణాటక | 22.49 cr |
తమిళనాడు | 11.45 cr |
హిందీ | 62.44 cr |
కేరళ | 6.89 cr |
ఓవర్సీస్ | 64.47 cr |
రెస్ట్ | 6.23 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 322.23 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని) |
‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ (Salaar) చిత్రానికి రూ.336.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.338 కోట్ల షేర్ ను రాబట్టాలి. 22 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.322.23 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.15.77 కోట్ల షేర్ ని వసూల్ చేయాలి.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!