ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ అనే భారీ బడ్జెట్ సినిమా వచ్చింది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న రిలీజ్ అయ్యింది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ సో సోగానే ఉన్నా, పాటలు కూడా జస్ట్ ఓకే అనిపించినా, సినిమా పై మాత్రం మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే తొలి రోజు మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. దీంతో మొదటి వారం సూపర్ గా కలెక్ట్ చేసింది ఈ మూవీ. 9 వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 64.31 cr |
సీడెడ్ | 18.13 cr |
ఉత్తరాంధ్ర | 14.47 cr |
ఈస్ట్ | 8.59 cr |
వెస్ట్ | 6.47 cr |
గుంటూరు | 8.67 cr |
కృష్ణా | 6.63 cr |
నెల్లూరు | 4.32 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 131.59 cr |
కర్ణాటక | 20.25 cr |
తమిళనాడు | 10.09 cr |
హిందీ | 51.60 cr |
కేరళ | 6.03 cr |
ఓవర్సీస్ | 57.25 cr |
రెస్ట్ | 3.90 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 280.71 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని) |
‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ (Salaar) చిత్రానికి రూ.336.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.338 కోట్ల షేర్ ను రాబట్టాలి. 9 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.280.71 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.57.29 కోట్ల షేర్ ని వసూల్ చేయాలి.
డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!