Salaar: సలార్ సినిమా నుంచి వరుస అప్ డేట్స్.. అసలేం జరిగిందంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమా రిలీజ్ కు మరో ఐదు వారాల సమయం మాత్రమే ఉంది. ప్రశాంత్ నీల్ అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని అప్ డేట్స్ రాగా తాజాగా ఈ సినిమా బుకింగ్స్ కు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. వైరల్ అవుతున్న అప్ డేట్ ప్రకారం సలార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపు ఉండనుంది.

సినిమా రిలీజ్ కు రెండు వారాల ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకానున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో రెండు వారాల ముందు సలార్ కు బుకింగ్స్ మొదలుకావడం అంటే ఫ్యాన్స్ కు శుభవార్త అనే చెప్పాలి. సలార్ సినిమా పిల్లలు, పెద్దలు అనే తేడల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండనుందని తెలుస్తోంది.

అడ్వాన్స్ సేల్స్ విషయంలో సలార్ చరిత్ర సృష్టిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ ఓవర్సీస్ బుకింగ్స్ ఈ నెల 25వ తేదీ నుంచి మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతల ప్లానింగ్ అదుర్స్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అతి త్వరలో ఈ సినిమా ఫైనల్ కాపీ సిద్ధం కానుందని రవి బస్రూర్ ఈ సినిమా మ్యూజిక్, బీజీఎం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.

ఈ సినిమాపై (Salaar) అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. సలార్ పార్ట్1 క్లైమాక్స్ ట్విస్ట్ పోకిరి, బాహుబలి సినిమాలను మించి ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus