‘బాహుబలి’ హీరో ప్రభాస్, ‘కేజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన భారీ బడ్జెట్.. పాన్ ఇండియా సినిమా ‘సలార్’. రెండు పార్టులుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి పార్ట్ ‘సలార్ : సీజ్ ఫైర్’ పేరుతో రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవానికి సెప్టెంబర్ 28నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని అంతా అనుకున్నారు. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు.
అవి ‘జవాన్’ కంటే కూడా ఎక్కువగా నమోదయ్యాయి. కానీ ఏమైందో ఏమో.. ఊహించని విధంగా ‘సలార్ : సీజ్ ఫైర్’ పోస్ట్ పోన్ అయ్యింది.దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు ‘సలార్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు కూడా అప్సెట్ అయ్యారు. ఎప్పుడు విడుదలవుతుంది అనేది కూడా చిత్ర బృందం ఇంకా ప్రకటించింది లేదు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘సలార్’ డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వార్త ప్రకారం.. ‘సలార్ : సీజ్ ఫైర్’ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ‘నెట్ ఫ్లిక్స్’ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ‘సలార్’ డిజిటల్ హక్కులను ఆ సంస్థ భారీగా రూ.160 కోట్ల భారీ రేటుకు దక్కించుకున్నట్టు తెలుస్తుంది.ఇది మామూలు విషయం కాదు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకి సాధ్యం కాని ఫీట్ అది.
ఇక ‘సలార్’ (Salaar) మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా … జగపతిబాబు, ఈశ్వరీ రావు, పృథ్వీరాజ్ సుకుమారన్, గోపి, శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ వంటి వారు నటిస్తుండగా… ‘హోంబలే ఫిల్మ్స్’ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!