Salaar Re-release Collections: తక్కువ టైంలో రీ- రిలీజ్ అయినా రికార్డు కొట్టింది.. ..!

‘బాహుబలి’ (Baahubali) తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సినిమాల్లో ‘సలార్’ కి (Salaar) కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దేవా పాత్రలో ప్రభాస్ అదరగొట్టాడు. మాస్ ఆడియన్స్ ఈ రోల్ బాగా కనెక్ట్ అయ్యింది. ఇలాంటి రోల్ కోసమే ఆడియన్స్, ఫాన్స్ ఎదురుచూశారు. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘డంకి’ (Dunki) వంటి సినిమాతో పాటు రిలీజ్ అయినా… ‘సలార్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్ల పైనే వసూళ్లు సాధించి రికార్డులు కొట్టింది.

Salaar Re-release Collections:

ఆ తర్వాత ఓటీటీల్లో కూడా బాగా ట్రెండ్ అయ్యింది. అయితే ఆల్రెడీ ఈ సినిమా 2 సార్లు రీ- రిలీజ్ అయ్యింది. ఆ టైంలో పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. అయితే మార్చి 21న 3వ సారి రీ రిలీజ్ చేశారు. ఈసారి మాత్రం బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.48 Cr
సీడెడ్ 0.37 Cr
ఆంధ్ర(టోటల్) 1.42 Cr
ఏపీ + తెలంగాణ (టోటల్ ) 3.27 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.19 Cr
ఓవర్సీస్ 0.63 Cr
వరల్డ్ వైడ్ టోటల్ 4.09 Cr

‘సలార్’ రీ రిలీజ్ 3 రోజుల్లో రూ.4.09 కోట్లు గ్రాస్ ను కొల్లగొట్టింది. 3వ సారి రీ- రిలీజ్లో కూడా ఈ రేంజ్ వసూళ్లు ఎవ్వరూ ఊహించలేదు.

సీనియర్ యాంకర్ గాయత్రీ ఎమోషనల్ కామెంట్స్.. వీడియో వైరల్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus