Salaar: సలార్ సక్సెస్ మీట్.. స్పెషల్ ఎట్రాక్షన్ గా ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలై దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికీ చిత్ర బృందం ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సినిమా మొత్తం డార్క్ షెడ్ లోని కొనసాగుతూ ఉంటుంది

అందుకుగాను సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా చిత్ర బృందం మొత్తం బ్లాక్ కలర్ డ్రెస్ లో సందడి చేశారు. ఈ కార్యక్రమాలలో భాగంగా నైజాం హక్కులను కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత విజయ్ కిరంగదూర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ పృధ్విరాజ్ సుకుమారన్ వంటి వారందరూ పాల్గొని సందడి చేశారు. వీరందరూ సరదాగా కేక్ కట్ చేస్తూ ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.

ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రభాస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.ఈయన బ్లాక్ కలర్ టీ షర్ట్ తో పాటు తలకు క్యాప్ పెట్టుకొని ఈ సెలబ్రేషన్స్ లో భాగమయ్యారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా సక్సెస్ ఇంత ఆలస్యంగా చేయడానికి కారణం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని అయితే ఇప్పుడే ఈ సినిమా (Salaar) బ్రేక్ ఈవెన్ సాధించడంతో ఇప్పుడు సెలబ్రేషన్స్ జరుపుకున్నారని తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus