Prabhas: సలార్ మూవీ ఆ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందా?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటంతో మలయాళ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి పాత్రకు ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్తలు తీసుకునే ప్రశాంత్ నీల్ సలార్ సినిమా విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్టు క్లారిటీ రావడంతో

సలార్ సినిమా ఏకంగా 3000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్2 బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుని అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారనే సంగతి తెలిసిందే. కేజీఎఫ్2 రిలీజయ్యే సమయానికి యశ్ కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా క్రేజ్ లేకపోయినా ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభ వల్లే కేజీఎఫ్2 అంచనాలను మించి విజయం సాధించింది.

అయితే ప్రభాస్ కు పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు ఉంది. ప్రభాస్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. అయితే బాహుబలి2 సినిమా తర్వాత ప్రభాస్ కోరుకున్న స్థాయి సక్సెస్ అయితే దక్కలేదనే సంగతి తెలిసిందే. సలార్ సినిమాతో ప్రభాస్ కు ఆ లోటు కచ్చితంగా తీరుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్, ప్రాజెక్ట్ కే ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా 3000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus