ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అంటే ఉన్న చోట గెలిచి, ఆ తర్వాత బయటకు వెళ్లి పోరాడాలి, గెలవాలి. అయితే ప్రతిసారి పోరాటానికి వెళ్లినప్పుడు ఇంట గెలవాల్సిందేనా? అంటే కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటే… ప్రశాంత్ నీల్ కోసమే. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘సలార్’ సినిమాకు శాండిల్ వుడ్‌లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు కాబట్టి. అవును మీరు చదివింది కరెక్టే. టీమ్ చెప్పిన లెక్కల ప్రకారమే ఈ మాట అంటున్నారు.
‘సలార్’ సినిమా ఈ నెల 22న దేశవ్యాప్తంగా విడుదలైంది. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 402 కోట్ల గ్రాస్ వచ్చింది అని టీమ్ అనౌన్స్ చేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ వసూళ్లు అంత ఎక్కువగా లేవు అని చెబుతున్నారు. అందులో ఫస్ట్ ప్లేస్‌లో బాలీవుడ్ ఉంటే, రెండో స్థానంలో శాండిల్ వుడ్ అని చెబుతున్నారు. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమా ఉండటంతో ప్రభాస్ ‘సలార్’కు ఆశించిన థియేటర్లు రాలేదు.
దీంతో హిందీ నాట (Salaar) ‘సలార్’కు వసూళ్లు ఆ స్థాయిలో లేవు. ఇక కన్నడ నాట సినిమాకు ఓ మోస్తరు వసూళ్లు వచ్చాయి అని సమాచారం. తమిళనాడు. కేరళ కన్నా కర్ణాటకలో మెరుగ్గానే ఉన్నప్పటికీ అక్కడి దర్శకుడే తీసిన సినిమాకు అక్కడ ఇంకా భారీ వసూళ్లు రావాలి అని అంటున్నారు. ఎందుకంటే మూడు రోజులకు కన్నడనాట ‘సలార్’ సినిమా రూ. 15 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు. దీంతో ఏమైందా అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు ఫ్యాన్స్.
ఈ విషయంలో ఆలోచిస్తే… కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు ప్రశాంత్ తొలి సినిమా ‘ఉగ్రం’కు దగ్గర పోలికలు ఉన్నాయనే పుకారు పెద్ద ఎత్తున జరిగింది. దీంతో చూసిందే మళ్లీ ఎందుకు అని జనాలు రావడం లేదు అంటున్నారు. మరోవైపు కన్నడ హీరోలతో కాకుండా వేరే ఇండస్ట్రీలకు ఎందుకు వెళ్లడం అంటూ కొంతమంది కన్నడ అభిమానులు ప్రశాంత్ విషయంలో గుర్రుగా ఉన్నారు అనే టాక్ కూడా ఉంది.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!