Salaar: ‘కె.జి.ఎఫ్’ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న ప్రశాంత్ నీల్.. ఆ డేట్ ఫిక్స్..!

ప్రభాస్ హీరోగా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ‘ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ‘ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ‘హోంబలే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై విజయ్ కిరంగధూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది.అయితే కొంత ప్యాచ్ వర్క్ బాలన్స్ ఉండటంతో .. ఇప్పుడు రీ షూట్లు చేస్తున్నారు.

రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కాబోతుంది అని యూనిట్ ఇదివరకే ప్రకటించింది. (Salaar) మొదటి భాగం ‘సలార్ : సీజ్ ఫైర్’ పేరుతో సెప్టెంబర్ 28 న రిలీజ్ కావాలి. కానీ డిలే అయిన సంగతి తెలిసిందే. దీంతో నెక్స్ట్ డేట్ ఎప్పుడుంటుంది అనేది చిత్ర బృందం ఇంకా ప్రకటించింది లేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ 22 లేదా ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 21 న ‘సలార్ : సీజ్ ఫైర్’ రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అదే సీజన్ కి గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కే.జి.ఎఫ్ చాప్టర్ 1 ‘ రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ‘సలార్’ విషయంలో కూడా అదే రిపీట్ అవ్వుద్దని ప్రశాంత్ నీల్ నమ్ముతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను టీం అధికారికంగా వెల్లడిస్తుంది. అయితే ఆ డేట్ కి రావాల్సిన ‘హాయ్ నాన్న’ ‘సైందవ్’ సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయా లేక ప్రీ పోన్ అవుతాయా అనేది చూడాలి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus