అదిరిపోయే వసూళ్లతో రన్ ప్రారంభించి… అమాంతం నెమ్మదించింది ‘సలార్’. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు రూ. 650 కోట్ల మార్కును అందుకుంది. అయితే తొలి వారంతం వసూళ్లు చూస్తే ఈ సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి. ఒక విధంగా మన దేశంలో ఈ సినిమా రన్ దాదాపు ముగిసినట్లే అని అంటున్నారు. అయితే ఇక్కడ ముగిసిన రన్‌ను మరో చోట స్టార్ట్ చేస్తారు అని చెబుతున్నారు.
ప్రపంచ ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడానికి ‘సలార్’ సినిమాను వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఆదివారం సినీ వర్గాలు ప్రకటించాయి. జపాన్‌కు చెందిన ప్రముఖ సినిమా పంపిణీ సంస్థ ట్విన్ అక్కడ ‘సలార్’ సినిమాను విడుదల చేయనుంది. ‘బాహుబలి’ సినిమాల నుండి జపాన్ ప్రేక్షకులు ప్రభాస్ సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ‘ఆర్‌ఆర్‌ఆర్’ కూడా రిలీజ్ చేసి మంచి వసూళ్లే అందుకున్నారు.
ఇప్పుడు ‘సలార్: సీజ్ ఫైర్’ సినిమాను జపాన్‌లో అందుకే రిలీజ్ చేస్తారు అంటున్నారు. ఆ దేశంతోపాఉట మార్చి 7న లాటిన్ అమెరికాలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అక్కడ స్పానిష్ భాషలో సినిమాను విడుదల చేస్తారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయడానికి కొన్ని బాలీవుడ్ సినిమాలు ఆదర్శం అంటూ వార్తలొస్తున్నాయి. ఆమిర్ ఖాన్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడు చేసిన ‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమాలను ఏకంగా చైనాలో కూడా విడుదల చేశారు.
ఆ సినిమాలకు చైనా నుండి భారీ వసూళ్లు వచ్చాయని బాలీవుడ్ సినిమా ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఈ క్రమంలో ఆయా దేశాల్లో విడుదల చేసి ఇక్కడ మన దేశంలో మిస్ అయిన వసూళ్లను అక్కడ సాధించే పనిలో ఉన్నరు అంటున్నారు. ఈ మేరకు సినిమా టీమ్ విదేశాలకు వెళ్లి మరీ ప్రచారం చేస్తుంది అంటున్నారు. అయితే ప్రభాస్ ఇప్పుడు బిజీ షెడ్యూల్స్‌లో ఉన్నాడు. మరి ‘సలార్’ (Salaar) ప్రచారం కోసం విదేశాలకు వెళ్తాడా అనేది చూడాలి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!