Prabhas, Yash: ‘కేజీయఫ్‌ 2’తోపాటు ‘సలార్‌’ వస్తాడా?

రాకీ భాయ్‌ సెకండ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా మరోసారి రాకీ సామ్రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్లడానికి ప్రశాంత్‌ నీల్ – యశ్‌ సిద్ధమైపోయారు. అయితే రాకీతోపాటు మరో వ్యక్తి కూడా తన సామ్రాజ్యాన్ని పరిచయం చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘కేజీయఫ్‌ 2’తో పాటు మరో సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ కూడా రావొచ్చు అనే పుకార్లు వినిపిస్తున్నాయి. ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’కి కొనసాగింపుగా ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ ను తెరకెక్కించారు ప్రశాంత్‌ నీల్‌.

కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా సమ్మర్‌ స్పెషల్‌ అంటూ ఏప్రిల్‌ 14న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. తెలుగులో అంత జోరు లేదన్నది ఇక్కడ అప్రస్తుతం అనుకొండి. అయితే ఈ సినిమాను వేరే సినిమా ప్రచారానికి వాడుకుంటున్నారు అనేది ఇక్కడ మేటర్‌. ‘కేజీయఫ్‌ 2’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘సలార్‌’. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల బ్రేక్‌ పడింది.

‘కేజీయఫ్‌ 2’ ప్రచారం కోసమే ఆ షూటింగ్‌ ఆపేశారు అని చెప్పొచ్చు. అయితే ‘కేజీయఫ్‌ 2’ సినిమాలో సుమారు 30 సెకన్ల ‘సలార్‌’ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేస్తారని చెబుతున్నారు. అంటే ‘బాహుబలి ది కంక్లూజన్‌’ సినిమాతోపాటు ‘సాహో’ గ్లింప్స్‌ వచ్చినట్లన్నమాట. ‘ఇట్స్‌ షో టైమ్‌’ అంటూ అప్పుడు ప్రభాస్‌ చెప్పాక ‘బాహుబలి 2’ స్టార్ట్‌ అయ్యింది గుర్తుందిగా.ఇప్పటి వరకు షూట్‌ చేసిన ‘సలార్‌’ సీన్స్‌ నుండే కట్‌ చేసి గ్లింప్స్‌ను సిద్ధం చేశారని అంటున్నారు.

ఎంత ప్రభాస్‌ సినిమా అయినా… ‘కేజీయఫ్‌ 2’తో పాటు బయటకు వివరాలు వస్తే ఆ హైప్‌ వేరు అని చెప్పొచ్చు. అందుకే ప్రశాంత్‌ నీల్‌ ఈ మేరకు ఆలోచించారని అంటున్నారు. అయితే దీనిపై చిత్రబృందం నుండి కానీ, ప్రశాంత్‌ నీల్‌ నుండి కానీ ఎలాంటి సమాచారం లేదు. అలా అని ఖండించనూ లేదు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus