Salaar: ఆ కటౌట్‌ పక్కన ఈ కటౌట్‌ అయితేనే కరెక్ట్‌ అనేలా!

‘సలార్‌’లో పృథ్వీరాజ్‌ సుకుమార్‌.. ఈ వార్త చాలా రోజుల పాటు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే సినిమా టీమ్‌ నుండి ఎప్పుడూ ఎలాంటి కన్ఫర్మేషన్‌ రాలేదు. దీంతో ఇది కేవలం పుకారుగా మాత్రమే మిగిలిపోతుందా అని అభిమానులు అనుకున్నారు. ఎందుకంటే ప్రభాస్‌ వర్సెస్‌ పృథ్వీరాజ్‌ సుకుమార్‌ చూడాలనేది వారి కోరిక. అయితే కన్ఫర్మేషన్‌ రాకపోయేసరికి ఇక కష్టమే అనుకున్నారు. అలాంటి సమయంలో ‘కడువా’ ప్రచారంలో డార్లింగ్‌ ఫ్యాన్స్‌కి స్వీట్‌ న్యూస్‌ చెప్పాడు పృథ్వీరాజ్‌.

ఇప్పుడు చిత్రబృందం ఇంకాస్త తీపిని యాడ్‌ చేసి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ప్రశాంత్‌ నీల్‌ సినిమాలు అంటే ముఖానికి మసి ఉండే లుక్‌ కామన్‌. అది హీరో అయినా, విలన్ అయినా ఎవరైనా ఇలానే ఉంటారు. అందులోనూ ‘సలార్‌’ బొగ్గు గని నేపథ్యంలో అని అంటున్నారు కాబట్టి.. ఇంకాస్త ఎక్కువ మసి ఉంటుంది. ఇప్పుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ లుక్‌ కూడా అలానే డిజైన్‌ చేసి రిలీజ్‌ చేశారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పృథ్వీరాజ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్‌’ టీమ్‌ ఈ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది.

ప్రభాస్‌కు తగ్గ కటౌట్‌ పృథ్వీరాజ్‌ది అని ఇందాకే అనుకున్నాం. లుక్‌ కూడా అలానే డిజైన్‌ చేశారు. ‘సలార్‌’లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌… వరదరాజ మన్నార్‌ పాత్రలో కనిపిస్తాడు. సుమారు 11 నెలల తర్వాత రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం తరచుగా అప్‌డేట్లు ఇస్తూనే ఉంది. మరోవైపు లీక్‌లు కూడా అలానే వస్తూనే ఉన్నాయి. ప్రభాస్‌ లుక్‌ కూడా అలానే ముందు బయటికొచ్చింది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబరు 28న విడుదల చేయనున్నారు.

‘కేజీయఫ్‌’ సిరీస్‌ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌ అయిపోయిన ప్రశాంత్‌ నీల్‌.. ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌తోనే ‘సలార్‌’ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది అనే టాక్‌ కూడా ఉంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus